
Lover Boy: ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్. తాజాగా ఆయన కుటుంబం నుంచి తన వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. శంకర్ కుమారుడు అర్జిత్ శంకర్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రేజీ లాంచింగ్ ప్రాజెక్ట్‌కు ‘లవర్ బాయ్’ (Lover Boy) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. శంకర్ కూతురు అదితి శంకర్ ఇప్పటికే హీరోయిన్‌గా రాణిస్తుండగా, ఇప్పుడు కొడుకు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ క్రేజీ లవ్ స్టోరీలో టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కృతి శెట్టి ఈ సినిమాలో జాయిన్ అవ్వడం ప్రాజెక్ట్‌పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్యూట్ అండ్ ఫ్రెష్ పెయిర్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలని ఫిల్మ్ సర్కిల్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రానికి అశోక్ కుమార్ (Ashok Kumar) అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. ఒక విభిన్నమైన – యూత్‌ఫుల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థలు కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) – ప్యాషన్ స్టూడియోస్ (Passion Studios) సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే మిగతా నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.
