Site icon TeluguMirchi.com

divyendu sharma: వెంకీ – త్రివిక్రమ్ ‘AK47’ లోకి రామ్‌బుజ్జి!

Divyendu sharma

divyendu sharma: విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (#AK47). ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండగా, తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ (మున్నా భయ్యా) తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నారట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దివ్యేందు శర్మ. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తాజాగా ఆయన వెంకీ మామా సినిమాలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర కోసం లాక్ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్‌తో ఈ పాత్ర నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని రాబోయే విజయాదశమి (దసరా) పండుగ కానుకగా థియేటర్లలోకి గ్రాండ్‌గా తీసుకురావడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నారట. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి దివ్యేందు పాత్రకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం. ఒకవైపు వెంకీ మాస్ అండ్ క్లాస్ లూక్, మరోవైపు రామ్‌బుజ్జి ఫేమ్ దివ్యేందు శర్మ పవర్‌ఫుల్ రోల్ తో ఈ దసరా పండుగకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోందని అంటున్నారు.

Exit mobile version