
Erra Cheera : బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’, దీపావళికి వారం ముందు, అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వయంగా ఒక ముఖ్య పాత్రలో కూడా కనిపించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కలిగిన కుటుంబ కథగా రూపొందిన ఈ సినిమా బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ హైలైట్‌గా ఉన్నట్లు సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, “సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ ఖతర్నాక్‌గా ఉంది. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో మదర్ సెంటిమెంట్ కలిగిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా కుటుంబంతో కలిసి చూడదగినది. ప్రతి ఒక్కరు తప్పక థియేటర్‌కు రావాలని కోరుతున్నాం” అని తెలిపారు. అలాగే ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 3న రిలీజ్ అవుతుందని, అక్టోబర్ 5న విజయవాడలో గ్రాండ్ ప్రీ-రిజిలీజ్ ఈవెంట్ జరుపుతామని ప్రకటించారు.
ఎర్ర చీర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణను కలిసి సినిమా ట్రైలర్ ను చూపించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ఎర్ర చీర ట్రైలర్ చాలా బాగుందని, సినిమా అక్టోబర్ 10న విడుదల అవుతోందని, అందరూ తప్పకుండా థియేటర్లలలో చూడాలని చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
