Site icon TeluguMirchi.com

Ghaati Censor Report : ‘ఘాటి’ సెన్సార్ టాక్.. అనుష్క విశ్వరూపం!

Ghaati

Ghaati Censor Report :చాలా గ్యాప్ తర్వాత, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన తాజా చిత్రం ‘ఘాటి’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసేందుకు సెన్సార్ బోర్డ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలను మెచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయని సెన్సార్ సభ్యులు పేర్కొన్నారు.

సినిమా ప్రారంభంలో, అనుష్క చూపించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. రైల్వే స్టేషన్ సీక్వెన్స్ మరియు గుహలో జరిగే యాక్షన్ ఫైట్ సన్నివేశాలు, సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌ ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఉంచాయి. సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు, అలాగే క్లైమాక్స్లో ఉండే గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు సినిమా విజయానికి కీలకంగా నిలుస్తాయని అంచనా వేయబడుతోంది.

ఈ చిత్రంలో అనుష్క పోషించిన శీలావతి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా చెప్పబడుతోంది. ఆమె నటన సినిమాకు ప్రాణాన్ని పోసినట్లు సెన్సార్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ సీన్స్ లో అనుష్క స్వయంగా పాల్గొన్నారని, ఆమె రా & రియలిస్టిక్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని సమాచారం. ఈ సినిమాతో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు విక్రమ్ ప్రభు తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. అనుష్కతో కలిసి ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. ప్రత్యేకంగా అనుష్క-విక్రమ్ ప్రభు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది.

Exit mobile version