Site icon TeluguMirchi.com

Haiku Movie: మనల్ని మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే లవ్ స్టోరీ.. ‘హైకూ’పై కోన వెంకట్ క్రేజీ కామెంట్స్!

Haiku Movie

Haiku Movie: ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు, ఆ సమయంలో పుట్టే మొదటి ప్రేమ ఎప్పటికీ చెరిగిపోని మధుర జ్ఞాపకాలు. అలాంటి స్వచ్ఛమైన భావోద్వేగాలను, క్యాంపస్ లైఫ్‌లోని అందమైన క్షణాలను మళ్లీ కళ్లముందుంచేలా వస్తున్న తాజా రొమాంటిక్ యూత్‌ఫుల్ మూవీ ‘హైకూ’. ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ జంటగా నటించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ట్రైలర్ చూసిన వెంటనే చాలా ప్లెసెంట్ ఫీలింగ్ కలిగిందని చెప్పిన కోన వెంకట్.. అందరినీ ఆశ్చర్యపరిచే ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. “అసలు సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టకుండా, కేవలం కథ మాత్రమే చెప్పి గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేశారంటే ఈ స్క్రిప్ట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ తమ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే చాలా సిన్సియర్ లవ్ స్టోరీ ఇది” అంటూ కథాబలాన్ని కొనియాడారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీదేవి నటన కోసమైనా ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందేనని అన్నారు.

యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా.డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రేమలో ఉండే అందంతో పాటు అందులో ఎదురయ్యే కాంప్లికేషన్స్, రిలేషన్‌షిప్ సమస్యలను చాలా రియలిస్టిక్‌గా ఇందులో చూపించామని చిత్రబృందం చెబుతోంది. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే మనసుకు హత్తుకుందని, లవ్‌లో ఉన్నవారితో పాటు పెళ్లైన జంటలకు కూడా ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. సిద్ధు కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని, హైదరాబాద్‌లోనే మళ్లీ సక్సెస్ మీట్ పెట్టుకుంటామని హీరో ఏగన్ ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు రామ్ జగదీశ్ మాట్లాడుతూ సినిమా అవుట్‌పుట్ చాలా ఆహ్లాదకరంగా వచ్చిందని, యూత్‌కు బాగా నచ్చుతుందని చెప్పారు. కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న ఈ క్యాంపస్ లవ్ స్టోరీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version