Site icon TeluguMirchi.com

ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్

Rahaman prod1
తెలుగు, తమిళ మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు రషీన్ రహమాన్. 1987లో రాగలీల సినిమాతో పరిచయమై భారత్ బంద్, ప్రియతమా, బిల్లా, సింహ వంటి సినిమాల్లో తనదైనటువంటి శైలి లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు. మే 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ Production No. 1 నుండి ఒక ప్రత్యేక బర్త్డే పోస్టర్ ను లాంచ్ చేస్తున్నారు.

ఆ పోస్టర్ ద్వారా ఆయన పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే, అందులోని మిస్టరీని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. రహ్మాన్ గారు ఈ చిత్రానికి తీసుకొచ్చిన ఎలిగెన్స్ మరియు ప్రభావవంతమైన ప్రెజెన్స్ను ఈ పోస్టర్ ప్రతిబింబిస్తుంది. ఇది ఒక ఆసక్తికరమైన సినీ ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు టీం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్.

Exit mobile version