Site icon TeluguMirchi.com

Hrithik Roshan: హోంబాలే ఫిల్మ్స్ బిగ్ స్కెచ్ అంటూ ప్రచారం.. హృతిక్ – పరశురామ్ కాంబోపై తేలిపోయిన గాసిప్స్!

Hrithik Roshan

Hrithik Roshan: టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ – ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్‌లోకి రాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన పరశురామ్.. ‘KGF’, ‘సలార్’ వంటి భారీ చిత్రాల నిర్మాతలతో కలిసి బాలీవుడ్ గ్రీక్ గాడ్‌ను డైరెక్ట్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో కూడా క్యూరియాసిటీని పెంచింది.

అయితే ఈ క్రేజీ కొల్లాబరేషన్‌పై తాజాగా ఒక పక్కా క్లారిటీ వచ్చేసింది. ఆన్‌లైన్‌లో, వివిధ వెబ్‌సైట్లలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలన్నీ ముమ్మాటికీ బేస్‌లెస్ అని తేలిపోయింది. డైరెక్టర్ పరశురామ్, హోంబాలే ఫిల్మ్స్, హృతిక్ రోషన్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. నిజానికి పరశురామ్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉండగా.. హృతిక్ రోషన్ తన సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు హోంబాలే ఫిల్మ్స్ సైతం పలు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ కుదిరిందంటూ వచ్చిన రూమర్స్ ఫ్యాన్స్‌ను కాసేపు ఖుషీ చేసినప్పటికీ.. అందులో ఎలాంటి నిజం లేదని తేలడంతో ఈ గాసిప్స్‌కు ఇక్కడితో పూర్తి బ్రేక్ పడినట్లయింది.

Exit mobile version