
Irumudi: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మోస్ట్ ప్రామిసింగ్ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు రవితేజ తన అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించారు.
ఆకట్టుకుంటున్న తండ్రీకూతుళ్ల పోస్టర్
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెల్ని హత్తుకునే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని స్పష్టమవుతోంది. పవిత్రమైన అయ్యప్ప దీక్షతో ముడిపడిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో తప్పులు చేసి, ఆ తర్వాత రియలైజ్ అయిన ఒక మారిన తండ్రి పాత్రలో రవితేజ కనిపించనున్నారట. తన ప్రాణ సమానమైన కూతురిని రక్షించుకోవడం కోసం ఆ తండ్రి చేసిన సుదీర్ఘమైన, ఉద్వేగభరితమైన ప్రయాణమే ఈ ‘ఇరుముడి’ కథాంశం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
“ప్రేక్షకులకు ఒక అత్యద్భుతమైన, అందమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం” అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ఖరారు కావడంతో అటు రవితేజ అభిమానుల్లో, ఇటు సినీ ప్రేమికుల్లో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.
Promising you all a beautiful cinematic experience in theaters ❤️🔥#IRUMUDI / #IRUMUDIKATTU in cinemas from 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟮𝟭𝘀𝘁, 𝟮𝟬𝟮𝟲! pic.twitter.com/RxSaP8LqhF
— Ravi Teja (@RaviTeja_offl) June 7, 2026
