Site icon TeluguMirchi.com

Irumudi Trailer: ఆగస్టు 12న భీమవరంలో ‘ఇరుముడి’ ట్రైలర్ రచ్చ..

Irumudi

Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ‘ఇరుముడి’ చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 12న భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించే గ్రాండ్ ఈవెంట్‌లో ‘ఇరుముడి’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన ప్రకటన రావడంతో రవితేజ అభిమానుల్లో జోష్ పెరిగింది.

మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్, ట్యాగ్‌లైన్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. “When family means everything, a man will do anything for them” అనే లైన్‌తో సినిమాకు సంబంధించిన కథాంశంపై మేకర్స్ ఆసక్తిని రేకెత్తించారు. కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడే ఎమోషనల్ కథతో ‘ఇరుముడి’ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. సాయికుమార్, బేబీ నక్షత్ర, విష్ణు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా **ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version