
Bōdhi Kalpak: సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2023లో వచ్చిన ‘జైలర్’ సంచలన విజయం సాధించడంతో, ఈ స్వీకెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రిలీజ్ చేసిన సరికొత్త అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ప్రతినాయక పాత్రలో వెర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన స్టైలిష్ వీడియో ప్రస్తుతం అభిమానులను పిచ్చెక్కిస్తోంది.
ఈ సీక్వెల్‌లో ‘బోధి కల్పక్’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో ఎస్.జె. సూర్య కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఇంట్రడక్షన్ గ్లింప్స్‌లో ఆయన విలనిజం, మ్యానరిజమ్స్ సినిమాపై ఉన్న హైప్‌ను ఒక్కసారిగా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మాస్ యాక్షన్‌కు ధీటుగా ఎస్.జె. సూర్య పండించబోయే నెగెటివ్ షేడ్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మలయాళ స్టార్ సురాజ్ వెంజరమూడు ‘దిలీప్’ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించిన మేకర్స్, ఇప్పుడు సూర్య ఎంట్రీతో ‘జైలర్ 2’ కాస్టింగ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు చేర్చారు. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సీక్వెల్‌కు మరింత ఊపు తెస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ‘జైలర్ 2’లో రజనీకాంత్ – ఎస్.జె. సూర్య మధ్య సాగే ఫేస్-ఆఫ్ కోసం సినీ ప్రేమికులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు.
