Site icon TeluguMirchi.com

Tollywood Trend: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీకి బాలీవుడ్ స్టార్ కిడ్స్ జోడీ?

Jayakrishna

Tollywood Trend: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ త్వరలో టాలీవుడ్‌లో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఆయన లాంచ్ సినిమా గురించి ఇండస్ట్రీలో హల్‌చల్ జరుగుతూనే ఉంది. ‘Rx 100’, ‘మహాసముద్రం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే జయకృష్ణ డెబ్యూ చేస్తున్నాడని సమాచారం. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి తాజా వార్త ఏంటంటే—జయకృష్ణకు జోడీగా ఓ స్టార్ కిడ్డే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందట. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీను హీరోయిన్‌గా ఫైనల్ చేసే అవకాశముందని ఫిలింసర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాషా ఈ ఏడాది ‘ఆజాద్’ అనే బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇప్పుడు జయకృష్ణ సరసన తెలుగు తెరపై కనిపించబోతోందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు ప్రేక్షకులకు రవీనా టాండన్ సుపరిచితమే. గతంలో ‘బంగారు బుల్లోడు’, ‘రథసారధి’, ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాల్లో నటించింది. ‘కేజీఎఫ్ 2’లో కూడా కీలక పాత్రలో మెరిసింది. ఇప్పుడు తన కుమార్తె రాషా తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడాలని రవీనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాదే రాషా తెలుగు ఎంట్రీ గురించి టాక్ వచ్చినా, ఆ ప్రాజెక్ట్ స్థిరపడలేదు. ఇప్పుడు మాత్రం ఘట్టమనేని వారసుడి డెబ్యూ సినిమాలో హీరోయిన్‌గా రాషా పేరు బలంగా వినిపిస్తోంది. అజయ్ భూపతి ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నారట. ప్రముఖ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌కు తోడ్పడుతున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంచనా.

Exit mobile version