Site icon TeluguMirchi.com

Jigris : జిగ్రీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

Jigiris date
యువత కోసం ప్రత్యేకంగా తెరకెక్కిన మరో ఫీల్‌గుడ్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ‘జిగ్రీస్’ సిద్ధమవుతోంది. “ఈ నగరానికి ఏమైంది” తరహాలో యూత్‌ఫుల్ ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్, మ్యూజిక్‌లతో నిండిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ‘మ్యాడ్ స్క్వేర్’ ఫేమ్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా, అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే టీజర్ 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యువతలో భారీ హైప్ క్రియేట్ చేసింది.

హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఈశ్వర్ ఆదిత్య సినిమాటోగ్రఫీ, చాణక్య రెడ్డి తూర్పు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, కమ్రాన్ సయ్యద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని సంగీతం ఇప్పటికే యువతలో మంచి ఆదరణ పొందుతోంది. టీజర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ పాజిటివ్ బజ్‌ను సృష్టించడంతో, నవంబర్ 14న విడుదల కానున్న ‘జిగ్రీస్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

టెక్నికల్ టీమ్
🎬 డైరెక్టర్ : హరీష్ రెడ్డి ఉప్పుల
🎥 డి.ఓ.పి : ఈశ్వర్ ఆదిత్య
🎶 మ్యూజిక్ డైరెక్టర్ : కమ్రాన్ సయ్యద్
✂️ ఎడిటర్ : చాణక్య రెడ్డి తూర్పు
🎵 మ్యూజిక్ లేబుల్ : T-Series
📲 డిజిటల్ మార్కెటింగ్ : Big Fish Media

Exit mobile version