Site icon TeluguMirchi.com

Jigris : ‘జిగ్రీస్’ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ – చీఫ్ గెస్ట్ గా సందీప్ రెడ్డి వంగా!

Jigris
Jigris : నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా గొడవలు, పంచ్‌లు, క్రేజీ అడ్వెంచర్స్ నేపథ్యంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా, కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సినిమాకు ‘జిగ్రీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, తొలి లుక్‌ను సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. వింటేజ్ మారుతి 800 కారు పక్కన నలుగురు ఫ్రెండ్స్ నిలబడి ఉన్న పోస్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను కూడా సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 8న రాత్రి 8 గంటలకు ఎల్‌బీనగర్‌లోని అర్బన్ మాయా బజార్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. చిన్ననాటి స్నేహితుల నోస్టాల్జియా, హిలేరియస్ రోడ్ ట్రిప్, మాస్ యూత్ పిచ్చి కలగలిపిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పోస్టర్‌తో మంచి హైప్‌ను సొంతం చేసుకున్న “జిగ్రీస్” టీజర్ కూడా యువతను మెప్పించే అవకాశం ఉందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

Exit mobile version