
Anirudh Ravichander: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక సరికొత్త భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ చిత్రంపై ఇటు ఫ్యాన్స్‌లోనూ, అటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారట.
‘దేవర’ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్లోబల్ రేంజ్ మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుధ్.. మరోసారి తారక్ సినిమాకు సైన్ చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో మ్యూజిక్ లవర్స్‌తో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా మస్త్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఈ భారీ పాన్ – ఇండియా ప్రాజెక్ట్‌కు అనిరుధ్ కంటే బెస్ట్ ఆప్షన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంతో సాగనుందని సమాచారం. ఒక వేళ ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు అయితే ఈ సబ్జెక్ట్ కోసం పూర్తిగా సరికొత్త సౌండింగ్, సరికొత్త ఆర్కెస్ట్రేషన్‌తో రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు మాస్, కమర్షియల్ చిత్రాలకు అదిరిపోయే అవుట్‌పుట్ ఇచ్చిన ఈ రాక్‌స్టార్‌కు.. ఇలాంటి ఒక మైథో-డివైన్ బ్యాక్‌డ్రాప్ చిత్రానికి సంగీతం అందించడం అసలైన ఛాలెంజ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ కాంబినేషన్‌పై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారో చూడాలి.
