Site icon TeluguMirchi.com

Junior : వైరల్ వయ్యారి గా శ్రీలీల మ్యాజిక్!


Junior : ప్రముఖ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న డెబ్యూ మూవీ ‘జూనియర్’ జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన చిత్రబృందం, ఇప్పుడు రెండవ పాట *‘వైరల్ వయ్యారి’*తో అందర్నీ అలరిస్తోంది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ పూర్తిగా మాస్ ఎనర్జీతో నిండిపోయి యువతను బాగా ఆకర్షిస్తోంది. DSP, హరిప్రియ గొంతులు, కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ ఈ పాటను సోషల్ మీడియా టెంప్లేట్‌లా తీర్చిదిద్దాయి. సాంగ్‌లో కిరీటి రెడ్డి స్టెప్పులు గ్రేస్‌తో మెరిశాయి, శ్రీలీల తన ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఎలిగెన్స్‌తో పాటను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. సెట్స్, కలర్ ఫుల్ విజువల్స్, ట్రెండీ బీట్‌తో పాట చార్ట్‌బస్టర్ హిట్‌గా మారడానికి అన్ని అద్భుతమైన అంశాలున్నాయి. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ, నిరంజన్ ఎడిటింగ్ ఇలా టెక్నికల్ టీమ్ కూడా బలంగా నిలుస్తోంది. జూనియర్ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా, వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Exit mobile version