Site icon TeluguMirchi.com

Kalki 2 Casting Call: ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్! కొత్త టాలెంట్‌కు మేకర్స్‌ కాస్టింగ్‌ కాల్..

Kalki 2 Casting Call

Kalki 2 Casting Call: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం పురాణాలు, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రభాస్‌ భైరవగా, అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌గా, దీపికా పదుకొనె సుమతిగా కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కల్కి 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కావాలనుకునే ఔత్సాహిక నటీనటులకు మేకర్స్‌ ప్రత్యేక అవకాశం కల్పించారు. కొత్త టాలెంట్‌ కోసం అధికారికంగా కాస్టింగ్‌ కాల్‌ ప్రకటించారు.

“ఆస్పైరింగ్‌ యాక్టర్స్‌ అందరికీ ఇదో అవకాశం. కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కండి” అంటూ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు తమ ప్రొఫైల్‌, నటనకు సంబంధించిన వివరాలను [kalkiuniversecasting@gmail.com](mailto:kalkiuniversecasting@gmail.com)కు పంపించాలని సూచించారు. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన కల్కి యూనివర్స్‌ను రెండో భాగంతో మరింత విస్తరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘కల్కి 2’లో కథ, పాత్రలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని సినీ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్‌ నటులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యూనివర్స్‌లో కొత్త నటీనటులకు అవకాశం కల్పించడం ఆసక్తికరంగా మారింది. నటన రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటున్న వారికి ఇది మంచి అవకాశంగా మారనుంది. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను పై ఈమెయిల్‌ అడ్రస్‌కు పంపించవచ్చు.

Exit mobile version