Site icon TeluguMirchi.com

Kalki 2: ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్.. ‘కల్కి 2’కి మరోసారి బ్రేక్!

Kalki

Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2’ తదుపరి షెడ్యూల్ మరోసారి వాయిదా పడినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమాకు కేటాయిస్తున్న సమయం కారణంగానే ‘కల్కి 2’ షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ‘కల్కి 2’ ఇప్పటికే నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన కీలక భాగాలను పూర్తి చేసేందుకు చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. అయితే ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ నుంచి ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్, ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ‘కల్కి 2’ తదుపరి షెడ్యూల్ మరింత ఆలస్యం కావచ్చనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ డేట్స్ కోసం చిత్రబృందం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ వాయిదాపై ‘కల్కి 2’ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభాస్ కమిట్‌మెంట్ల కారణంగా షెడ్యూల్ మార్పు జరిగిందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version