Site icon TeluguMirchi.com

Kalyani Priyadarshan: బాలీవుడ్‌లోకి కళ్యాణి ప్రియదర్శన్ ఎంట్రీ.. రణ్‌వీర్ సింగ్‌ సినిమాలో ఛాన్స్!

Kalyani Priyadarshan

Kalyani Priyadarshan: సౌత్ స్టార్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్‌లో మరో కీలక అడుగు పడబోతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర’ సక్సెస్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

తాజా బజ్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘ప్రళయ్’ సినిమాలో హీరోయిన్‌గా కళ్యాణి ప్రియదర్శన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారని, పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుందట. భారీ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తొలి సినిమానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కావడంతో కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్‌కు ఇది కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు.

Exit mobile version