Site icon TeluguMirchi.com

Kannappa : కన్నప్ప గ్లోబల్ యాత్ర: మే 8 నుంచి అమెరికాలో విష్ణు మంచు…


డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటివ్ వైబ్ ను సృష్టించాయి. మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మధుబాల వంటి భారీ తారాగణం నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మోహన్ బాబు అవా ఎంటర్టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో విష్ణు మంచు మే 8 నుంచి అమెరికాలో కన్నప్ప మూవ్‌మెంట్ ప్రారంభించనున్నారు. న్యూ జెర్సీలో రోడ్ షోతో ఈ గ్లోబల్ ప్రమోషన్ లాంచ్ అయి, డల్లాస్, లాస్ ఏంజిల్స్ వంటి నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నాడు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్, వర్కింగ్ వీడియోలు సెలెక్టెడ్ ఆడియన్స్‌కి చూపించనున్నారు.

Exit mobile version