Site icon TeluguMirchi.com

Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ మేకింగ్ వీడియో రిలీజ్.. రిషబ్ శెట్టి మ్యాజిక్‌కి నెటిజన్లు ఫిదా!

Kantara
Kantara Chapter 1 : హోంబలే ఫిల్మ్స్ మరోసారి మాస్ & క్లాస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రాజకుమార, కెజిఎఫ్, సలార్, కాంతార వంటి ఘన విజయాల తర్వాత ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో లో మూడు సంవత్సరాల కష్టం, 250 రోజుల షూటింగ్ కష్టాలను అద్భుతంగా చూపించారు. కేవలం బీహైండ్ ద సీన్స్ వీడియో మాత్రమే కాకుండా, ఇది ఒక సినిమాటిక్ జర్నీని చూపే ఫెస్టివల్‌లా అనిపిస్తుంది.

ఈ వీడియోలో రిషబ్ శెట్టి డెడికేషన్, విభిన్న భూభాగాల్లో జరిగిన గ్రాండ్ సెటప్‌లు, టీమ్ వర్క్ అన్నీ హైలైట్ అయ్యాయి. సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ తన స్పిరిచువల్ టచ్‌తో నేపథ్య సంగీతాన్ని మంత్రిముగ్ధం చేయగా, ఆర్ట్ డైరెక్టర్ వినేష్ బంగ్లాన్ రూపకల్పన చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విభాగంలో అరవింద్ కాశ్యప్ వర్క్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రిషబ్ శెట్టి మ్యాజిక్‌కి ఫిదా అవుతున్నారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version