
Kanya Kumari : ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ ‘కన్యా కుమారి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీచరణ్ గీత్ సైనీని ప్రేమగా ఎత్తుకుంటూ, ఆమె చేతులకు సీతాకోకచిలుక రెక్కలు అలంకరించినట్టు డిజైన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘అన్ ఆర్గానిక్ ప్రేమ కథ’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.
శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో సహజ వాతావరణంలో నడిచే ఈ లైఫ్ ఫీల్ ప్రేమకథ సినిమాటిక్ టచ్‌తో కొత్త అనుభూతిని అందించనుంది. రవి నిలమర్తి అందించిన మధురమైన సంగీతం, శివ గాజుల, హరి చరణ్ కె అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ కలిసి ఈ ప్రేమకథను మరింత అందంగా తీర్చిదిద్దాయి. పల్లె అందాలు, హృద్యమైన ప్రేమకథ, పండుగ వాతావరణంతో ‘కన్యా కుమారి’ ఈ సీజన్‌లో అందరి మనసులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది.
