Site icon TeluguMirchi.com

Kareena Kapoor: ధనుష్‌కు జోడీగా కరీనా కపూర్?సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో భారీ మైథలాజికల్ మూవీ!

Kareena Kapoor

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి నటించనున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కించనున్న కొత్త చిత్రంలో ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు కరీనా కపూర్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్నారని సమాచారం. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనుందని, విజువల్‌గా గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పురాణ నేపథ్యంతో పాటు యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ అంశాలు కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే వచ్చే ఏడాదిలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కరీనా కపూర్ యాక్ట్ చేస్తుందనే వార్తలకు సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version