
Karthi: వెండితెరపై పోలీస్ పాత్రలు చాలామంది హీరోలు వేస్తుంటారు. కానీ కొందరికి మాత్రమే ఆ ఖాకీ చొక్కా తిరుగులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి వారిలో కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తి ముందు వరుసలో ఉంటారు. ఆయన పోలీస్ ఆఫీసర్‌గా బరిలోకి దిగిన ప్రతిసారీ థియేటర్లలో కాసుల వర్షం కురవడమే కాకుండా, కెరీర్‌లోనే భారీ విజయాలు నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్‌ను, అదే పవర్‌ను రిపీట్ చేసేందుకు కార్తి వరుసగా పోలీస్ కథలనే లాక్ చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కార్తి నటించిన కాప్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు రాబోయే లైనప్‌లో కూడా ఖాకీ కథలకే ఆయన పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తుంది.
విలక్షణ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కార్తి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇది అత్యంత పదునైన, భారీ స్థాయి పోలీస్ స్టోరీతో తెరకెక్కుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సంచలన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘హిట్ 4’లో కార్తి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ‘హిట్ 3’ ముగింపులో ఆయన పాత్రను పరిచయం చేసి ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ పక్కా ఇన్వెస్టిగేటివ్ కాప్ డ్రామా కార్తి కెరీర్‌లోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. వరుసగా సీరియస్ పోలీస్ కథలతో విరుచుకుపడే కంటే ముందే, ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచేందుకు కార్తి సిద్ధమయ్యారు. తెలుగులో ‘మ్యాడ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం కార్తి ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం ఆయన ఎలాంటి ఖాకీ హంగులు లేకుండా, ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వినోదంతో అలరిస్తూనే, బ్యాక్-టు-బ్యాక్ పోలీస్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు కార్తి వేస్తున్న ఈ ప్లాన్ కచ్చితంగా ఆయన మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
