Site icon TeluguMirchi.com

Sardar 2: ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో ఏజెంట్ ‘సర్దార్’ విధ్వంసం ఆ రోజే!

Sardar

Sardar 2: టాలీవుడ్, కోలీవుడ్‌లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్దార్ 2’ (Sardar 2) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ నేడు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హీరో కార్తి ఈ సినిమాకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్‌ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. గన్ పట్టుకుని ఏజెంట్ సర్దార్ (చంద్రబోస్) లుక్‌లో కార్తి నిలబడి ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ పేలుడు సంభవించే విజువల్స్‌తో కూడిన క్రేజీ గ్లింప్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్‌ను అద్భుతంగా తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ ఈ సీక్వెల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ స్థాయి లొకేషన్లలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ పార్ట్‌లో కార్తి సరసన స్టార్ బ్యూటీ మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తుండగా, ఫస్ట్ పార్ట్ నుంచి రజీషా విజయన్ తన పాత్రను రిపీట్ చేస్తోంది. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ S.J. సూర్య ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలో కామెడీ కింగ్ యోగి బాబు అలరించనున్నారు. ఈ భారీ స్పై థ్రిల్లర్‌కు సామ్ సి.ఎస్ (Sam CS) అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం బిగ్ స్క్రీన్‌పై సరికొత్త యాక్షన్ విజువల్స్ చూపించబోతోంది. ఈ సెప్టెంబర్ రేసులో ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version