GAMA Awards 2025 : దుబాయ్‌లో టాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా ఎదురుచూసే GAMA (Gulf Academy Movie Awards) 5వ ఎడిషన్ ఘనంగా జరిగింది. వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties ఆధ్వర్యంలో ఆగస్ట్ 30న షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులు, వేలాది సినీ అభిమానుల సమక్షంలో ఈ అవార్డుల వేడుక ప్రెస్టీజియస్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యం వహించారు. జ్యూరీ చైర్‌పర్సన్స్‌గా ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, సంగీత దర్శకుడు కోటి వ్యవహరించారు.
ప్రధాన అవార్డులు
బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప 2 ది రూల్)
బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ మూవీ – పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్ – యలమంచిలి రవి, నవీన్ యెర్నేని)
బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)
బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898 AD)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఇతర విభాగాల్లో అవార్డులు
బెస్ట్ కొరియోగ్రఫీ – భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)
బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – రత్నవేలు (దేవర)
బెస్ట్ లిరిసిస్ట్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే.. దేవర)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (Male) – అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (Female) – మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – రజాకార్
బెస్ట్ యాక్టర్ క్రిటిక్ – తేజ సజ్జా
అలాగే ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు హీరో సత్యదేవ్ (జీబ్రా) దక్కించుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ గా ఊర్వశి రౌటెల సత్కరించబడ్డారు.
స్పెషల్ అవార్డులు
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు – నిర్మాత అశ్విని దత్
గ్లోబల్ కమెడియన్ అవార్డు – బ్రహ్మానందం
వేడుకలో హైలెట్స్
హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశీ రౌటెల, మానస వారణాశి స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు. యాంకర్ సుమ, హర్ష వినోదభరిత వ్యాఖ్యలతో వేదికను సందడి చేశారు. గామా సీఈఓ సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. “వేలాది తెలుగు, తమిళ, మలయాళ సినీ అభిమానుల సమక్షంలో దుబాయ్‌లో ఈ వేడుక నిర్వహించడం గర్వంగా ఉంది. గామా వేదికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

