Site icon TeluguMirchi.com

Kiran Abbavaram: పౌరాణిక పాత్రలో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఇదే!

Kiran Abbavaram

Kiran Abbavaram: వరుస విజయాలతో జోరుమీదున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు విభిన్న కథలు, జానర్లతో ఆకట్టుకున్న ఆయన.. తొలిసారి భారీ పౌరాణిక యాక్షన్ ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఇంద్రపుత్ర’ అనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ‘క’, ‘కే ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఆయన.. ప్రతి సినిమాతో కొత్త జానర్‌ను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఇంద్రపుత్ర’తో మరింత వైవిధ్యమైన ప్రయత్నానికి సిద్ధమయ్యారు.

ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్‌తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ పుప్పాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆ అనుభవంతో ఇప్పుడు భారీ పౌరాణిక కథను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఇంద్రపుత్ర’లో పౌరాణిక అంశాలతో పాటు యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్‌ను మేళవించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ పౌరాణిక పాత్రలో ఆయన నటించనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version