Site icon TeluguMirchi.com

K-Ramp Teaser : ‘K-ర్యాంప్’ టీజర్ రిలీజ్.. కిస్సులతో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం!

K ramp
K-Ramp Teaser : యువ న‌టుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘K-ర్యాంప్’ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైన్స్ నాని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై రాజేశ్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

టీజర్‌లో కిరణ్ అబ్బవరం కుమార్ అనే పాత్రలో కనిపిస్తాడు. కేరళలోని ఓ కాలేజీలో చేరిన అతను, హీరోయిన్‌ను ప్రేమిస్తాడు. ఇద్దరూ వింతగా, యూత్‌ఫుల్‌గా ఉండే వారి ప్రేమకథను మజాగా చూపించారు. టీజర్ మొత్తం యూత్‌ఫుల్ వైబ్స్‌తో, బోల్డ్ కిస్సులతో, ఫన్నీ డైలాగ్‌లతో నిండి ఉంది. కిరణ్ అబ్బవరం కొత్త స్టైల్‌లో కనిపించగా, యుక్తితో ఆయన కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. చైతన్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.

Exit mobile version