Site icon TeluguMirchi.com

ప్రేరణ అరోరా నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ చిత్రం

Kiran abbavaram new movie o
ప్రఖ్యాత నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment), జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఒక భారీ పాన్-ఇండియా చిత్రంను నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్‌ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version