
K-Ramp OTT : సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘K-ర్యాంప్’ థియేటర్లలో మంచి స్పందనను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే సినిమా చూస్తున్న వారు తమకు నచ్చిన సీన్స్, పాటల స్క్రీన్‌షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాష్‌ట్యాగ్‌లతో వైరల్ చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ నటన, యూత్‌ఫుల్ స్టోరీ, ఆకర్షణీయమైన సాంగ్స్ ఈ సినిమాకు కీలక బలాలు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై రైజింగ్ ప్రొడ్యూసర్‌లు రాజేష్ దండ, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ ఎంటర్‌టైనర్‌ను చూసేయండి.
