
Lokesh Kanagaraj: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి చేయనున్న ‘AA23’ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తన సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌పై లోకేశ్ స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ‘లియో’, ‘కూలీ’ వంటి చిత్రాల విషయంలో తాను ఆన్‌లైన్‌లో విమర్శలను ఎదుర్కొన్న విషయాన్ని లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొందరు ప్రేక్షకులు, నెటిజన్లు తన సినిమాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా.. వాటిని తాను సీరియస్‌గా తీసుకుంటున్నానని, భవిష్యత్తు తన సినిమాలతో వాటికి సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో తెరకెక్కనున్న ‘AA23’ తనపై వస్తున్న విమర్శలకు బలమైన సమాధానం ఇస్తుందని లోకేశ్ కానగరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా రిజల్ట్ విమర్శకులకు సమాధానం చెప్పేలా ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ‘AA23’ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. పురాణాలు, ఫాంటసీ, యాక్షన్ అంశాలను కలిపి ఈ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లోకేశ్ తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. మరోవైపు లోకేశ్‌పై అల్లు అర్జున్ చూపిస్తున్న అభిమానం కూడా ఈ కాంబినేషన్‌పై హైప్‌ను పెంచుతోంది. ఇటీవల తన సర్కిల్‌కు చెందిన ఓ సినిమాను ప్రశంసించిన సందర్భంలో అల్లు అర్జున్.. లోకేశ్‌ను ‘మై డైరెక్టర్’ అంటూ సంబోధించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ స్టైల్, లోకేశ్ కనగరాజ్ టేకింగ్ కలిస్తే ‘AA23’ ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమైతే.. త్వరలోనే మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
