Site icon TeluguMirchi.com

SSMB30: బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్.. బుచ్చిబాబుతో – మహేష్ బాబు సినిమా? ‘SSMB30’పై క్రేజీ లీక్!

Buchi Babu

SSMB30: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఎన్నడూ చేయని ఒక వైవిధ్యమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబు తన 30వ చిత్రంలో (SSMB30) అంధుడిగా కనిపించనున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ‘పెద్ది’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

సాధారణంగా గ్లామర్, క్లాస్ లుక్స్‌తో మెప్పించే మహేష్ బాబు.. ఫస్ట్ టైం కళ్లు కనిపించని ఒక చాలెంజింగ్ రోల్ చేయబోతున్నారనే లీక్ రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే X లో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. పాత్రల పరంగా ఎప్పుడూ కొత్తదనం కోరుకునే మహేష్ ఫ్యాన్స్, ఈ అప్‌డేట్‌తో పండగ చేసుకుంటున్నారు. బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ డ్రామాలో మహేష్ నటన విశ్వరూపం చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఈ కాంబినేషన్‌ను దాదాపు కన్ఫార్మ్ అయినట్లే అని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో అంటున్నారు. అయితే ఈ క్రేజీ అప్‌డేట్‌పై అటు మహేష్ బాబు టీమ్ నుంచి కానీ, ఇటు డైరెక్టర్ బుచ్చిబాబు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న బాబు.. ఆ తర్వాతే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందట. ఈ భారీ కాంబోపై త్వరలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది.

Exit mobile version