Photos: ‘రెడ్’ సినిమాలో రామ్‌తో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మాళవికా శర్మ తన అందం, అభినయంతో తక్కువ కాలంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. పెద్ద హిట్ సినిమాలో అవకాశం ఇంకా రాకపోయినా, ఒక్క సరైన బ్రేక్ దొరికితే టాలీవుడ్‌ను తనదైన స్టైల్లో శాసించగలవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘హరోమ్ హరా’ చిత్రంలో మాళవికా కనిపించింది. సినిమా ఎలా నిలిచినా, మాళవికా అందం, స్టైల్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో తుర్కువాయిస్ అండ్ వైట్ కలర్ డ్రస్‌లో చిక్ లుక్‌తో మెరిసిపోయింది. సాధారణమైన ప్యాకింగ్‌లోనూ గ్లామర్‌ను ఎలా చూపించాలో మాళవికా మరోసారి చాటిచెప్పింది.
అభినయం, గ్లామర్ మాత్రమే కాదు… మాళవికా బుద్ధిమంతురాలిగా కూడా పేరు తెచ్చుకుంది. ముంబయిలోని రిజ్వీ లా కాలేజ్ నుంచి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాజ్ (LLB) పూర్తి చేసిన మాళవికా ప్రస్తుతం లా కెరీర్‌ను కూడా కొనసాగిస్తుండటం విశేషం. సినీ రంగంలో అవకాశాలను వెతుక్కుంటూనే, న్యాయ రంగంలో అడుగులు వేస్తున్న మాళవికా బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తిగా నిలుస్తోంది.
టాలీవుడ్‌లో మాళవికా శర్మకి సరైన అవకాశం వస్తే, ఆమె స్టర్డమ్‌ను నిలబెట్టుకుని టాప్ హీరోయిన్ల సరసన నిలిచే రోజులూ ఎక్కువ దూరంలో లేవని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటివరకు ఆమె ఇన్‌స్టాలో దర్శనమిస్తూనే, ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది!

