Site icon TeluguMirchi.com

Mamitha Baiju: 2026లో మమితా బైజు హవా.. వరుసగా రూ.200 కోట్ల సినిమాలతో సౌత్‌ను షేక్ చేస్తున్న యంగ్ హీరోయిన్!

Mamitha Baiju

Mamitha Baiju: ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన యంగ్ అండ్ టాలెండ్ హీరోయిన్ మమితాబైజు. ఈ ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ యంగ్ హీరోయిన్.. ఇప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా 2026 ఆమె కెరీర్‌లో గోల్డెన్ ఇయర్‌గా నిలిచిందనే చెప్పాలి. ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకన్’, సూర్యతో కలిసి నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’, మలయాళ స్టార్ నివిన్ పౌలీతో చేసిన ‘బెత్లహేం కుడుంబ యూనిట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇందులో ‘బెత్లహేం కుడుంబ యూనిట్’ కేవలం 11 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. 2024లో విడుదలైన ‘ప్రేమలు’ సినిమాతో మమితాకు ఒక్కసారిగా సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఎంచుకుంటున్న కథలు, పాత్రలు, తనదైన క్లీన్ పెర్ఫార్మెన్స్‌తో వరుస అవకాశాలు అందుకుంటోంది. ముఖ్యంగా దక్షిణాది భాషలన్నింటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో అభిమానులు ఆమెను ‘ఇండియన్ సినిమా జెండయా’ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ PRS01 అనే ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ప్రస్తుతం సూపర్ జోష్‌లో ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.2-3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇలా వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్న ఈ హీరోయిన్ త్వరలోనే మరింత పెద్ద పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Exit mobile version