Site icon TeluguMirchi.com

MSG : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి ‘శశిరేఖ’ వచ్చేది అప్పుడే ?

Msvg
MSG : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్–ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుశ్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్లా’ ఇప్పటికే 75 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు రెండో పాట గురించి కొత్త అప్‌డేట్‌ను అందించింది చిత్రయూనిట్.

‘శశిరేఖ’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సాంగ్ ప్రోమో డిసెంబర్ 6న, లిరికల్ వీడియో డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి తన ప్రత్యేకమైన ఎనర్జీతో డ్యాన్స్ చేస్తుండగా, నయనతార స్టైలిష్ పోజ్‌తో మెరిసిపోతోంది. ఇద్దరి జోడీ అద్భుతంగా కనిపించడంతో పాటు, బ్యాక్‌డ్రాప్‌గా ఉన్న అందమైన పోర్ట్ లొకేషన్ చూస్తుంటే పాట విజువల్‌గా చాలా అందంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని బీమ్స్ సెసిరోలియో అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ తన షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. దీంతో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక చిరంజీవి–వెంకటేష్ కలిసి చేసిన మాస్ డ్యాన్స్ నంబర్ సినిమాలో మరో ప్రధాన హైలైట్‌ కానుంది. మరి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి 2026 కి గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version