Site icon TeluguMirchi.com

Manchu Lakshmi : ఓటిటి లో సౌండ్ చేస్తున్న దక్ష!

Daksha amazon
నటి మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించింది. తాజాగా అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల మద్దతుతో అమెజాన్ ట్రెండింగ్ లిస్ట్‌లో 9వ స్థానంలో నిలిచింది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీలో మంచు లక్ష్మీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకోగా, మోహన్ బాబు కీలక పాత్రలో మెప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన వరుస హత్యలను ఛేజ్ చేసే ఇన్వెస్టిగేటివ్ ట్రాక్ చుట్టూ సాగే కథ, దానిలోని సస్పెన్స్, ట్విస్టులు సినిమాను మరింత రసవత్తరంగా మలిచాయి.

సముద్ర ఖని, ‘రంగస్థలం’ మహేష్, యంగ్ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, మలయాళ నటుడు సిద్ధిఖీ వంటి ప్రముఖులు కూడా తమ నటనతో సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్లలో చూపిన ఇన్‌టెన్సిటీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. గత చిత్రాలకన్నా విభిన్నంగా సీరియస్ రోల్‌లో నటించిన ఆమె ఈసారి నిజమైన లేడీ ఆఫీసర్‌గా మంత్రముగ్ధులను చేసింది. దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన దక్ష సౌండ్ గట్టిగా చేస్తూ సందడి చేస్తోంది. భారీగా వ్యూస్ రాబడుతూ 9 స్తానంలో ఉన్న దక్ష దూసుకెళ్తోంది. గుండెల్లో గోదావరి, దొంగట సినిమాలలో మంచు లక్ష్మీ నటనకు ఎంతటి ప్రశంసలు వచ్చాయో ఇప్పుడు ఓటీటీ లో ట్రెండ్ అవుతున్న దక్షలో ఆమె నటనకు అంతే స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి.

Exit mobile version