Site icon TeluguMirchi.com

Maruva Tarama : మ్యూజికల్ లవ్ డ్రామా ‘మరువ తరమా’ ట్రైలర్‌పై విశేష స్పందన

Maruva tarama trailer
కోలీవుడ్ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ విడుదల చేసిన కవితాత్మక రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా ‘మరువ తరమా’ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి హల్‌చల్ సృష్టిస్తోంది. హృదయాన్ని తాకే సంగీతం, భావోద్వేగాలను పలికించే సన్నివేశాలు, కవిత్వంలా నెమ్మదిగా ప్రవహించే కథనం— అన్నీ కలిసి ట్రైలర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రేమ–సంగీత–భావాల అందమైన ప్రయాణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల మధ్య కనిపించే కెమిస్ట్రీ ట్రైలర్ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ప్రేమలోని తీయదనం, విడిపోవులోని నొప్పి, పాత్రలలోని నిజమైన భావాలు కథనానికి మరింత లోతును తీసుకువస్తున్నాయి. రచయిత–దర్శకుడు చైతన్య వర్మ నడింపల్లి సంగీతంతో అల్లిన ఈ కవితాత్మక ప్రేమకథను ఎంతో భావోద్వేగంగా తీర్చిదిద్దగా, సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం భావాల సున్నితత్వాన్ని అందంగా పట్టుకుంది.

విజయ్ బుల్గానిన్ & అరిష్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి హిట్ అయ్యింది. రుద్ర సాయి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను కవిత్వంలా మలిచింది. కె.ఎస్.ఆర్ ఎడిటింగ్ కథనానికి సరైన పేస్‌ను అందించింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి ట్రైలర్‌పై ఇచ్చిన ప్రశంసలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. ప్రేమ, సంగీతం, భావాలతో నిండిన మరువ తరమా నవంబర్ 28న థియేటర్లలో ప్రేక్షకులను ఒక మధురమైన భావప్రయాణంలోకి తీసుకెళ్లనుంది.

Exit mobile version