Site icon TeluguMirchi.com

NC24 : నాగ చైతన్య సినిమాలో దక్షగా మీనాక్షి చౌదరి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Nc24
NC24 : యువ సామ్రాట్ నాగ చైతన్య తన బ్లాక్‌బస్టర్ తండేల్ తర్వాత కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రం #NC24 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర దక్షగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్న మీనాక్షి లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉండి, క్యురియాసిటీ పెంచింది. ఫీల్డ్ డ్రెస్, గ్లవ్స్, గ్లాసెస్‌తో అంకితభావం, ధైర్యం కలిగిన ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి ఆకట్టుకున్నారు. ఇక నాగ చైతన్య ఈ చిత్రంలో ఇప్పటి వరకు చూడని లుక్‌లో కనిపించబోతున్నారు. ‘లా పతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్‌, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ జోరుగా సాగుతోంది, ఇందులో లీడ్ కాస్ట్ మొత్తం పాల్గొంటున్నారు.

Exit mobile version