Site icon TeluguMirchi.com

MCPK Trailer : ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ట్రైలర్

Mcpk
Meghalu Cheppina Prema Katha Trailer : యువ హీరో నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన “మేఘాలు చెప్పిన ప్రేమ కథ” ట్రైలర్ తాజాగా విడుదలైంది. విపిన్ దర్శకత్వంలో, ఉమా దేవి కోట నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలతో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. సంగీతాన్ని జీవితంగా భావించే యువకుడు, తన తండ్రి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొని, ఓ హిల్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ ఓ ఉల్లాసమైన అమ్మాయిని కలుసుకునే నేపథ్యంలో ఈ ప్రేమకథ కొనసాగుతుంది. ఆ అమ్మాయి పరిచయం అతని జీవితం, కలలు, ప్రేమపట్ల దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది.

ట్రైలర్ మొత్తం ప్రేమ, ఆశ, కలల మాధుర్యాన్ని బలంగా వ్యక్తపరుస్తూ, సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఉందన్న అభిప్రాయం కలిగిస్తోంది. నరేష్ అగస్త్య – రబియా ఖతూన్ మధ్య కెమిస్ట్రీ నేచురల్‌గా ఉంది. మొత్తంగా, ఈ ట్రైలర్ ఎమోషనల్‌గా, మ్యూజికల్‌గా, విజువల్‌గా ప్రేక్షకుల మనసులను తాకుతుంది. ఇకపోతే రాధిక శరత్‌కుమార్ నానమ్మ పాత్రలో ప్రభావవంతంగా కనిపించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం మెలోడియస్‌గా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, వెంకటేశ్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి, చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ, మోహన్ రామన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఆగస్టు 22న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version