
Meher Jyothi Sunkara: టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర సోమవారం రాత్రి విజయవాడలో కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సోదరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘నా ప్రియమైన చిన్నక్క “మెహెర్ జ్యోతి సుంకర ” సోమవారం 9:45 pm కి విజయవాడలో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ ,ప్రేమగా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనంద పడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు’ అంటూ ఆయన రాసుకొచ్చారు.
ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మెహర్ జ్యోతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
నా ప్రియమైన చిన్నక్క "మెహెర్ జ్యోతి సుంకర "
ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుండి తను నా అండ ,ప్రేమ గా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల… pic.twitter.com/WEPku2Kj1W— Meher Raamesh (@MeherRamesh) July 21, 2026
