Site icon TeluguMirchi.com

Missing Meghana: వి.వి.వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

Cinema

Missing Meghana: ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. దర్శకుడు వాచస్పతి, హీరో రామ్ కార్తీక్‌తో పాటు చిత్రబృందం మొత్తం ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ ప్రతిభావంతుడని, ఈ చిత్రం ఆయనకు కూడా మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.

డైరెక్టర్ వాచస్పతి మాట్లాడుతూ.. ‘మిస్సింగ్ మేఘన’ ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శకుడు వాచస్పతి, నిర్మాత నరేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నటులు పాల్గొన్నారు.

Exit mobile version