Site icon TeluguMirchi.com

The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ లో విలన్‌గా మోహన్ బాబు – ‘శికంజా మాలిక్’ పాత్రతో సంచలనం

Theparadise
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే నాని ‘జడాల్’ లుక్‌తో హంగామా సృష్టించగా, ఇప్పుడు మరో భారీ అప్‌డేట్ బయటకొచ్చింది. లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో విలన్‌గా ‘శికంజా మాలిక్’ పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ ను విడుద‌ల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్స్ లో మోహన్ బాబు వింటేజ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.

మోహన్ బాబు ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, మానరిజమ్స్‌తో ‘శికంజా మాలిక్’ పాత్ర చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ మార్చి 26, 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version