
NC24 : యువ సామ్రాట్ నాగ చైతన్య మునుపెన్నడూ చేయని మిథికల్ థ్రిల్లర్ #NC24 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన BTS మేకింగ్ వీడియోలో సినిమా భారీ స్థాయి సెట్స్, విజన్, అంబిషన్ స్పష్టంగా కనిపించాయి. నాగ చైతన్య తీసుకున్న ఫిజికల్, యాక్షన్ ట్రైనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజి మాస్టర్ పర్యవేక్షణలో ఆయన చేసిన శిక్షణ, పాత్ర కోసం తీసుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. అలాగే అనేకమంది ఆర్టిస్టులతో చిత్రీకరించిన భారీ సీన్స్, అజనీష్ లోకనాథ్ ఇచ్చిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకు మరింత మిస్టరీ, థ్రిల్‌ని జోడించాయి. మొత్తానికి అద్భుతమైన BTS మేకింగ్ గ్లిమ్ప్స్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
అంతేకాదు నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానుందని టీమ్ ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆసక్తికరమైన కాన్సెప్ట్, పవర్‌ఫుల్ టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న #NC24, మిథికల్ థ్రిల్లర్ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా కనిపిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ, అంబిషస్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తున్న ఈ చిత్రం మిథ్ ఆధారంగా, యూనిక్ నారేటివ్‌తో, హై ఇంటెన్సిటీ స్టోరీటెల్లింగ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా యాక్షన్ షెడ్యూల్ వేగంగా సాగుతోంది.
