Site icon TeluguMirchi.com

Vrushakarma: విరూపాక్ష డైరెక్టర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’ బిజినెస్ బ్లాక్‌బస్టర్!

Vrushakarma Movie

Vrushakarma: అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మిథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచేలా ఒక భారీ నాన్-థియేట్రికల్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్ (OTT), ఇతర నాన్-థియేట్రికల్ హక్కులన్నీ కలిపి ఒకే ప్యాకేజీ కింద భారీ రేటుకు అమ్ముడయ్యాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జీ సినిమాస్ / జీ టీవీ ఈ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇటీవలే రిలీజ్ అయిన ‘వృషకర్మ’ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను, ట్రేడ్ వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ క్రేజ్ వల్లే బిజినెస్ పరంగా భారీ ఆఫర్లు క్యూ కట్టాయట. జీ నెట్‌వర్క్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్ర హక్కులను భారీ ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకుందని సమాచారం. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు సగానికి పైగా పెట్టుబడి వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (SVCC బ్యానర్) – సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నాన్-థియేట్రికల్ డీల్‌కు సంబంధించిన అధికారిక లెక్కలు, ఓటిటి డిటైల్స్ త్వరలోనే రివీల్ కానున్నాయని సమాచారం.

Exit mobile version