Site icon TeluguMirchi.com

Nagarjuna 100th Movie: సగం షూటింగ్ పూర్తైనా.. నాగార్జున 100వ సినిమాపై సస్పెన్స్ ఎందుకు?

WhatsApp Image 2026 07 13 at 3.23.56 AM

Nagarjuna 100th Movie: అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ సినిమాపై ఇప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు సగం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నప్పటికీ, మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

నిజానికి స్టార్ హీరోల మైలురాయి చిత్రాలను స్టార్టింగ్ నుంచే ఘనంగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే నాగార్జున 100వ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ ఈ సంప్రదాయానికి పూర్తి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ముందుగానే భారీ అంచనాలు, అనవసర ఒత్తిడి ఏర్పడకుండా షూటింగ్‌లో కీలక భాగాన్ని పూర్తి చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలో నాగార్జునను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ, పాత్ర, విజువల్ ట్రీట్‌మెంట్ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అందుకే సినిమా గురించి ఒక్క విషయాన్ని కూడా బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక నాగ్ బర్త్ డే గిఫ్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లేదా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కింగ్ కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నాగ్ బర్త్‌డే సందర్భంగా ఈ సస్పెన్స్‌కు తెరపడుతుందా? లేక మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందా? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.

Exit mobile version