
Trisha vs Tamannaah: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను తెరకెక్కించే దర్శకురాలిగా నందినీ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నందినీ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్‌కి స్టోరీ, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని, కీలకమైన ఫీమెల్ లీడ్ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వెబ్ సిరీస్‌లో కీలకమైన ఫీమెల్ లీడ్ కోసం త్రిష, తమన్నా భాటియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఈ పాత్ర కోసం త్వరలోనే ఫైనలైజ్ చేసే అవకాశముందని నందినీ రెడ్డి సన్నిహిత వర్గాల టాక్. త్రిష ఇప్పటికే ఓటీటీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. ‘బృందా’ వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆమె.. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. తాజాగా నందినీ రెడ్డి తెరకెక్కించనున్న సిరీస్‌లోనూ త్రిష నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమన్నాకు కూడా వెబ్ సిరీస్‌లలో మంచి అనుభవం ఉంది. గతంలో ‘11th Hour’, ‘November Story’, ‘Do You Wanna Partner’ వంటి సిరీస్‌లలో ఆమె నటించారు. అయితే నందినీ రెడ్డి తదుపరి సిరీస్‌లో త్రిష లేదా తమన్నాలో ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ దశలోనే ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్రిషతో నందినీ రెడ్డి ఓ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరి ఈ ఇద్దరిలో అవకాశం ఎవరికి దక్కుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
