
The Paradise : నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’లో ఆయన ఇంతకు ముందు చేయని రీతిలో ఒక ఇంటెన్స్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, రా స్టేట్మెంట్ మరియు రెండు పవర్‌ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతోనే భారీ అంచనాలు రేపింది. తాజాగా విడుదల చేసిన ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ బీహైండ్-ది-సీన్స్ వీడియోతో మరింత హైప్ తెచ్చుకుంది. జైలు నేపథ్యంలో సాగిన ఈ వీడియోలో, రామోజీ ఫిలిం సిటీలో 15 రోజులపాటు చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన ఎక్సైటింగ్ గ్లింప్స్ చూపించారు. కత్తులు పట్టుకున్న ఖైదీల మధ్య, ఆయుధం లేకుండా ధైర్యంగా సీట్లో కూర్చున్న నాని, రెండు జడలు, ముఖంపై గాట్లు, రఫ్ & టఫ్ లుక్‌తో ఫెరోషియస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
దర్శకుడు శ్రీకాంత్ ఒదెల బోల్డ్ విజన్, రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఈ గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉండగా.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి రా, రియలిస్టిక్ టోన్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. రాఘవ్ జుయల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. బలమైన కథ, శక్తివంతమైన క్యారెక్టర్లు, గ్రాండియర్ విజువల్స్‌తో కూడిన ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
