
The Paradise: టాలీవుడ్ బాక్సాఫీస్ పోరు ఇప్పుడు విదేశీ గడ్డపై మరింత రసవత్తరంగా మారింది. నేచురల్ స్టార్ నాని నటించిన తాజా పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’ రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న వేళ, ఓవర్సీస్ మార్కెట్‌లో మునుపెన్నడూ చూడని రీతిలో ప్రీ-సేల్స్ తుఫాను సృష్టిస్తోంది. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొనసాగుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ఆల్-టైమ్ రికార్డులకు గండి కొట్టే దిశగా నాని దూసుకుపోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంకా సినిమా థియేటర్లలోకి రాకముందే అమెరికా, ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ హైప్ అంతా నేరుగా కలెక్షన్ల రూపంలో కనబడుతోంది. తాజా లెక్కల ప్రకారం.. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే పాజిటీవ్ టాక్ లభిస్తే, యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల మార్కును ‘ది పారడైజ్’ అత్యంత సునాయాసంగా దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ‘పెద్ది’ పేరిట ఉన్న ఓవర్సీస్ హయ్యెస్ట్ గ్రాసర్ రికార్డు కనుమరుగై, నాని కెరీర్‌లోనే ఇది అగ్రస్థానంలో నిలిచే ఆస్కారముంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ విజువల్ ట్రీట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించనుందో, ఎన్ని పాత రికార్డులను తిరగరాయనుందో చూడాలి.
