Site icon TeluguMirchi.com

NBK111 : హిస్టారికల్ ఎపిక్ #NBK111 లో బాలయ్యకు జోడీగా నయనతార

Nbk111
NBK111 : వరుస విజయాలతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ, ‘వీరసింహారెడ్డి’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి కలిశారు. వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న హిస్టారికల్ ఎపిక్ #NBK111‌ ను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మెజెస్టిక్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రాజెక్ట్ అంబిషస్ స్కేలు, గ్రాండ్ విజువల్స్ అన్నింటినీ చూపిస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ హై బడ్జెట్ సినిమాటిక్ స్పెక్టికల్ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరారు.

నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ఎనౌన్స్ మెంట్ చేశారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ సినిమాతో హిస్టారికల్ డ్రామా జానర్‌లోకి తొలిసారిగా అడుగుపెడుతున్న గోపీచంద్ మలినేని, తన మాస్ స్టైల్‌ను చారిత్రక కథతో మిళితం చేస్తూ బాలకృష్ణను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, అద్భుత విజువల్స్‌తో ఈ సినిమా గ్రాండ్ సినిమాటిక్ అనుభూతి ఇవ్వనుందని టీమ్ వెల్లడించింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Exit mobile version