Site icon TeluguMirchi.com

Nidhhi Agerwal: వాటిని పట్టించుకునే ప్రసక్తే లేదు: నిధి అగర్వాల్ బోల్డ్ రియాక్షన్

Nidhhi Agerwal

Nidhhi Agerwal: ఇష్మార్ట్ అందాలతో కుర్రకారులో మస్త్ క్రేజ్ సంపాదించుకున్న యువ నటి నిధి అగర్వాల్. అయితే ఇటీవల ఆమె నటించిన ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. దీంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు చేయడం, ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి.. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేలా కుండ బద్దలు కొట్టినట్లు
క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియా ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు. “ఇండస్ట్రీలో సక్సెస్‌పుల్ నటిగా పేరు తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది, నేను కూడా దానికి మినహాయింపు కాదు. కానీ సినిమా సక్సెస్ అనేది కేవలం ఒకరిద్దరి మీద మాత్రమే కాకుండా.. ఎన్నో సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. సినిమా ఆడినప్పుడు ఎంత సంతోషిస్తానో, ఆడనప్పుడు దానికి గల కారణాలను విశ్లేషించుకుని నన్ను నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను ఎప్పుడూ ‘లక్’ కంటే కేవలం నా ‘టాలెంట్‌’ను మాత్రమే నమ్ముకుంటాను” అని నిధి తేల్చి చెప్పారు. “నా కెరీర్‌లో పొగడ్తలను ఎప్పుడూ తలకెక్కించుకోలేదు.. అలాగే ఇలాంటి విమర్శలను, ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోను” అంటూ స్పష్టం చేశారు. ట్రోలర్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ, నెగెటివిటీని లైట్ తీసుకుని కేవలం వర్క్‌పైనే ఫోకస్ పెడుతున్నానని నిధి చెప్పిన విధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version