
Thammudu : ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ‘తమ్ముడు’ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘తమ్ముడు’ సినిమా ఔట్‌పుట్ ఈ స్థాయిలో రావడానికి ప్రధాన కారణం టెక్నీషియన్ టీమ్ కృషి అని తెలిపారు. డీవోపీ గుహన్ గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ – వీళ్లంతా దర్శకుడు శ్రీరామ్ వేణు విజన్‌ను స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ‘జై బగలాముఖి’ పాట సినిమాకు ప్రత్యేక వైబ్ ఇచ్చిందని, ఆ పాట రాసిన జొన్నవిత్తుల గారికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తన సంగీతంతో సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడన్నారు. ఇక శ్రీరామ్ వేణుతో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. మా బ్యానర్‌లో ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి హిట్స్ చేశాడు. ఆ సినిమాలకు మా సహకారం తీసుకున్నాడు. కానీ ‘తమ్ముడు’ మాత్రం పూర్తిగా ఆయన సోలో కష్టం. ఈ సినిమా సాధించబోయే విజయానికి క్రెడిట్ పూర్తిగా శ్రీరామ్ వేణుదే.
నితిన్ కమ్‌బ్యాక్, చరణ్‌తో కొత్త ప్రాజెక్ట్
నితిన్ గత కొన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా, ‘తమ్ముడు’ ఆయనకు కచ్చితంగా కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక, దిత్య – ఐదుగురు మహిళలు స్ట్రాంగ్ రోల్స్ చేశారు. వీళ్లందరూ హీరోలాగే కనిపించారు. వీళ్ల పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మా బ్యానర్‌కు మరో హిట్ ‘తమ్ముడు’ ఇవ్వబోతోంది. రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ చేశాం. కానీ సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే లోటు ఉంది. త్వరలో చరణ్‌తో ఓ సూపర్ హిట్ మూవీ ప్రకటించబోతున్నాం అని చెప్పారు.
